బావమరుదులు బావ బతుకు కోరుతారని సామెత.. కానీ ధర్మవరంలోని ఈ బావమరుదులు ఆ సామెత రివర్స్ చేశారు. అక్కను వేధిస్తున్నాడని ఏకంగా బావనే ఇద్దరు బావమరుదులు కడతేర్చారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.
అక్కను వేధిస్తున్నాడని.. నిత్యం తాగొచ్చి గొడవ పడుతున్నాడని.. ఇది చూసి తట్టుకోలేక ఏకంగా బావనే లేపేశారు ఆ బావమరిది. ధర్మవరం పట్టణానికి చెందిన మాలిన్ భాషా 14 ఏళ్ల క్రితం రాధ అనే మహిళ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. మాలిన్ భాషా, రాధా దంపతులకు నలుగురు పిల్లలు. కులాంతర వివాహం చేసుకుందని రాధా కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించలేదు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న మాలిన్ భాష మద్యానికి బానిస అయ్యాడు. రోజు మద్యం తాగి భార్య రాధాపై అనుమానంతో వేధింపులకు గురి చేస్తున్నాడు. నిత్యం తాగొచ్చి భార్య రాధాతో మాలిన్ భాషా గొడవ పడుతుండేవాడు. రోజు మాలిన్ భాష, రాధా మధ్య గొడవలు జరుగుతుండడంతో రాధా సోదరులు.. అంటే మాలిన్ భాష బావమరుదులు అనేకసార్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా బావ మాలిన్ భాషా తీరులో మార్పు రాకపోవడంతో పాటు అక్క రాధాపై వేధింపులు ఎక్కువయ్యాయి.
దీంతో తమ అక్కను వేధిస్తున్నాడని బావ మాలిన్ భాషాపై రాధా సోదరులు దాడి చేశారు. ఆవేశంతో ఊగిపోయిన బావమరుదులు పూలకుండీతో బావ భాషా తలపై కొట్టారు. దీంతో రక్తపు మడుగులో బావ మాలిన్ భాషా అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బావమరుదులు బావ బతుకు కోరుతారని సామెతను.. ధర్మవరంలోని ఈ బావమరుదులు రివర్స్ చేశారు. అక్కను వేధిస్తున్నాడని ఏకంగా బావనే ఇద్దరు బావమరుదులు కడతేర్చారు
Also Read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..
- జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం





