ప్రేమికులు రోజు… నిజమే.. కాస్త జాగ్రత్తగా లేకపోతే.. ప్రేమ జంటలు ఆనందంగా జరుపుకునే ఈ రోజు విషాదంగా మారొచ్చు. కడప జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. రోడ్డు ప్రమాదం ఓ యువతిని బలి తీసుకుంది. పూర్తి వివరాలు కథనం లోపల …
ఏపీలో వాలంటైన్స్ డే రోజే విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ప్రేమ జంటను లారీ ఢీకొనడంతో.. స్పాట్లోనే యువతి మృతి చెందగా, యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా విహారయాత్రకు బయలుదేరిన మూడు ప్రేమ జంటలు.. బైక్‌లపై జిల్లాలోని టూరిస్ట్ స్పాట్ గండికోటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఓ లారీ.. ఒక జంట ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో యువతి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన యువకుడిని స్థానికులు వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. తిరుపతి నుంచి గండికోటకు వెళ్తుండగా.. ఆలంఖాన్‌పల్లె సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కొనసాగుతున్న విచారణ.. ఇదిగో లేటెస్ట్ అప్డేట్!
- మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
- పాపం ఏం కష్టమొచ్చిందో..! అందరూ చూస్తుండగానే గోదావరి నదిలోకి దూకిన మహిళ!
- భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద మరణ పరిహారం ప్రకటించాలి ….గ్రీష్మ కుమార్,
- అబార్షన్ చేయించుకోమన్నారు.. చివరకు రోడ్డుపై పడేశారు! అత్తింటి ముందు గర్భిణీ దీక్ష!





