హైదరాబాద్: బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కానిస్టేబుల్కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నేరం రుజువు కావడంతో నిందితుడు వరదరాజ్ సుదేశకు 31 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అదనంగా బాధిత బాలికకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. 2020లో డీసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వరదరాజ్ సుదేశ్ బోయిన్ నపల్లి తాడుబండ్ ప్రాంతంలో నివసించే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగింది. ఆరు సంవత్సరాల అనంతరం నేరం నిరూపణ కావడంతో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Also read
- పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..? అసలు రహస్యం ఇదే!
- July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- మిస్టరీ బ్లాస్టర్.. నిప్పు లేదు.. సిలిండర్ పేలలేదు.. కానీ కిచెన్లో భారీ పేలుడు! భయాందోళనలో జనం!
- Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
- Watch Video: నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు.. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి..!




