లబ్బీపేట(విజయవాడతూర్పు):మాయమాటలు చెప్పి, శారీరకంగా లొంగదీసుకుని తనను మోసగించాడని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు నగరానికి చెందిన వైద్యుడిపై మహిళా పోలీసు స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. వివరాల ప్రకారం నూజివీడు ప్రాంతానికి చెందిన యువతి తొమ్మిదేళ్లుగా నగరంలోని వేర్వేరు హాస్పిటల్స్ లో నర్సుగా పనిచేస్తోంది.
2018లో ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే సమయంలో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పామర్తి భాస్కర్ ప్రకాష్ పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఆ యువతిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలవగా రెండుసార్లు గర్భం దాల్చింది. ప్రకాష్ తనకు బలవంతంగా గర్భస్రావం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని నిలదీయగా 2024 ఏప్రిల్లో ఓ ఇంట్లో తన మెడలో తాళి కట్టి దండలు మార్చుకున్నట్లు పేర్కొంది.
అప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను మూడవ నెల గర్భిణీ అని, కొన్ని రోజులుగా ప్రకాష్ తన వద్దకు రాకపోవడంతో విచారణ చేయగా, అతనికి ముందే పెళ్లి అయిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసినట్లు పేర్కొంది. ఈ విషయమై డాక్టర్ భాస్కర్ ప్రకాష్ ను నిలదీయగా, అతని భార్య, తల్లి తనను బెదిరించారని తెలిపింది. బాధితురాలు ఎస్సీ కావడంతో డాక్టర్ భాస్కర్ ప్రకాష్ అతని భార్య, తల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్లపై మహిళా పోలీస్ స్టేషన్ లో శుక్రవారం కేసు నమోదు చేశారు.
Also read
- మంచిగా ఉండమంటే.. తల్లినే చంపేశాడు..మిత్రుడితో కలిసి 16 ఏళ్ల కుమారుడి ఘాతుకం
- Sankashti Chaturthi :ఏడు రోజుల్లో మీకోరిక నెరవేరాలంటే…
- The Buddha:గోతమ బుద్ధుడు నెత్తిపై ఉన్న 108 పీతల రహస్యం
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అయ్యో తాత.. మనవడిని బతికించి ప్రాణాలు వదిలేశాడు.. అసలేం జరిగిందంటే..?





