Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేశ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపై తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు దాడి చేసి, నిప్పు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్పై జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.
శనివారం జోగి రమేశ్ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు జోగి రమేశ్ ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని ముందుగానే ఊహించిన జోగి రమేశ్, తన నివాసం నుండి వెళ్లిపోయారు. ఆవేశానికి లోనైన కార్యకర్తలు ఆయన ఇంటి ఆవరణలో ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ దట్టమైన పొగ కమ్ముకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సంఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిన్న సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఇంటి ముట్టడి ఘటన మరవకముందే, నేడు ఇబ్రహీంపట్నంలో ఈ తరహా దాడి జరగడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ నాయకులను విమర్శిస్తే సహించేది లేదని టీడీపీ కార్యకర్తలు హెచ్చరిస్తుండగా, ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
Also read
- తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..?
- హనుమాన్ జయంతి 2026: హనుమాన్ జయంతి ఎప్పుడు? ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!
- AP News: ‘నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా’.. కేటుగాళ్ల కొత్త రకం మోసాలు




