పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ముత్తారం: పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016లో పనులు ప్రారంభమయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది.
అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటివేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. వంతెన నిర్మాణం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. పిల్లర్లు, గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలు చెదలు పట్టాయి. దీంతో గట్లర్లు ఒకవైపు వంగినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నిర్మాణం చేపట్టకపోవడంతో బ్యాలెన్స్ తప్పి కూలినట్లు సమాచారం
Also read
- మసాజ్ సెంటర్ల ముసుగులో గలీజు దందా.. పోలీసుల మెరుపుదాడుల్లో విస్తుపోయే వాస్తవాలు!
- Illicit Relationship: అక్రమ సంబంధం పెట్టుకుందని.. తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు!
- హైదరాబాద్లో హార్ట్బ్రేకింగ్ విషాదం.. లవర్ వదిలేసిందని ఉరేసుకున్న యువకుడు
- తెలంగాణలో దారుణం.. కూతురిని వేధిస్తున్నాడని యువకుడిని అందరి ముందు హత్య చేసిన తండ్రి
- pakala: భార్య, ఇద్దరు బిడ్డలను బావిలోకి తోసి హత్య పాకాలలో హృదయ విదారక ఘటన