తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు.

పల్నాడు జిల్లాలో వైకాపా శ్రేణుల బరితెగింపు తెదేపా ఎస్సీ కార్యకర్తలపై దాడి
సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్టుడే: తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పెదమక్కెన ఎస్సీకాలనీకి చెందిన యువకులు సుమారు 20 ద్విచక్ర వాహనాలపై బయలుదేరి పెదకూరపాడు సమీపంలోని బంకుకు వెళ్లారు. అక్కడే వైకాపా అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలూ ద్విచక్ర వాహనాలతో ఉన్నారు. తెదేపా కార్యకర్తలను చూసిన వారు.. మద్యం తాగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కాసేపటికే పెదకూరపాడు నుంచి సుమారు 30 మందిని వైకాపా కార్యకర్తలు రప్పించారు. అంతా కలిసి తెదేపా వారిపై రాళ్లు, జెండా కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తలు మట్టుపల్లి మేరీబాబు, దిడ్లా చిననాగరాజు, మట్టుపల్లి సంగీతరావు, జరుగుమల్లి యేషయా, మట్టుపల్లి అనిల్, దిడ్లా పెదనాగరాజులకు గాయాలయ్యాయి. బాధితులను ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రంగా గాయపడిన మేరీబాబు, చిన నాగరాజును మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి రిఫర్ చేశారు. బాధితులను కన్నా లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు పరామర్శించారు.
Also read
- నేటి జాతకములు….12 నవంబర్, 2025
- Nandi in Shiva temple: శివాలయాల్లో
నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి? - శ్రీవారి సన్నిదిలో పట్టపగలు ఇదేం అపచారం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు!
- Pune Crime: ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు
- Annamaya District:దారుణం.. వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన






ఊడదీయడానికి అరటి తొక్క కాదు.. జగన్ కు ఎస్ఐ వార్నింగ్