రక్షక భటులు యాక్షన్ సీన్ చూపించారు. బజారులో బరి తెగించారు. పోట్ల గిత్తల్లా కమ్మేసుకున్నారు. నడి రోడ్డుపై బలప్రదర్శకు దిగారు. ముష్టి యుద్ధంతో సినిమా చూపించారు. ముఖాలు వాచిపోయేలా పిడిగుద్దులతో విరుచుపడ్డారు. చివరకు అలసి పోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇద్దరి బాగోతాన్ని వీడియో చూపించింది. ఇద్దరు పోలీసులు నడి మీద కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. యానిమల్’ సినిమా ఫైట్ చూసినట్లు ఉందని సెటైర్లు వేస్తున్నారు.
నడిరోడ్డుపై ఇద్దరు పోలీసులు కొట్టుకున్న ఘటన అనంతపురం జిల్లా రోళ్ల మండలం పిలిగుండ్లు చెక్ పోస్టు వద్ద జరిగింది. అందరూ చూస్తుండగానే ఇద్దరు ఖాకీలు యూనిఫామ్‌లోనే కొట్టుకున్నారు. వాహనాల తనిఖీల కోసం పిలిగుండ్లు చెక్ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం రోళ్ల, అగళి పోలీసు స్టేషన్లకు చెందిన నారాయణ స్వామి నాయక్, శివకుమార్‌ను ఉన్నతాధికారులు నియమించారు. అయితే తనిఖీలు చేస్తుండగా ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో కానిస్టేబుళ్లు ఒక్కసారి రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!