ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మూడవరోజు యోగ శ్రీనివాసుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయదేవేరులతో కొలువై ఆలయ ప్రాంగణం, క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించారు. ఆ తరువాత అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ చిన వెంకన్న సూర్య ప్రభవాహనంపై గ్రామంలో విహరించారు. పలువురు భక్తులు స్వామి, అమ్మ వార్లను దర్శించి తరించారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





