నర్సింగిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సన్‌సిటీలో మరో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న మహిళ మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు లాక్కెళ్లిపోయాడు. విజయ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది
TG Crime : ఏంట్రా నాయనా.. ఈ దొంగలు ఇలా తయారయ్యారు. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏకంగా కాలింగ్ బెల్ కొట్టి కొట్టేయడానికి సిద్దమైయ్యారు. ఈ దొంగల నుంచి తప్పించుకొని బ్రతకడం కష్టంగానే ఉంది. దొంగతనాలకి ఏకంగా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్నారు. చైన్ స్నాచింగ్ విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే బయటకు వెళ్తే చాలు ఏదో రకంగా ఒంటి మీద ఉన్న నగలు, డబ్బులను కాజేస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రాణాలు పోతున్నా కానీ లెక్క చేయరు వాళ్లు అనుకున్నది సాధించడమే లక్ష్యంగా చేస్తుంటారు.
మహిళలనే టార్గెట్‌గా ..
భాగ్యనగర్‌లో మరో ఘటన కలకలం రేపుతోంది. డైరెక్ట్‌గా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్‌కొట్టి ఒంటి మీద ఉన్న నగలను దోచుకొని వెళ్లిపోయ్యాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్‌గా చేసుకొని ఈ దారుణానికి పాల్పడుతున్నారు. మహిళలు, వృద్ధులు ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. బయటికెళ్తే దొంగల నుంచి కాపాడుకోవడమే కష్టంగా ఉందంటే ఇప్పుడు ఏకంగా ఇంటి మీదకే వచ్చేస్తున్నారు నగర వాసులు ఆదోంళన వ్యక్తం చేస్తున్నారు.
నార్సింగిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రెండ్రోల క్రితం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న 4 ఇండ్లలో దొంగతనం జరిగాయి. ఈ ఘటన మరువకముందే సన్‌సిటీలో మరో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న మహిళ మెడలో నుంచి దొంగ పుస్తెలతాడు లాక్కెళ్లిపోయాడు. సన్సిటీలోని విజయ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లికార్జున్ అతని భార్య మంజుల పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. శుక్రవారం దొంగ పక్క బిల్డింగ్‌లో నుంచి విజయ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత మల్లికార్జున్ ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపులు తెరిచిన మంజుల మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లిపోయాడు. ఈ దొంగ ఎవరు గుర్తు పట్టకుండా.. ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని బాధితురాలు మంజుల పోలీసులు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి చైన్ స్నాచర్‌ను తర్వాలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read
- శారీరకంగా వాడుకొని యువతిని మోసం చేసిన ప్రియుడు ప్రవీణ్…. వీడియో
- ఈ కోనలో వెలసిన నృసింహస్వామికి నారద, తుంబురుడు రోజూ పూజలు.. సాక్ష్యంగా తులసీదళాలు.. ఆలయం ఎక్కడంటే..
- Vaikunta Ekadasi 2025: 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం తెలుసుకోండి..
- Malavya Rajyog in 2025: కొత్త ఏడాదిలో మీన రాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..
- Shabarimala: శబరిమల ఆలయంలో మండల పూజ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి