హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా చేసుకుని బాలికలు, యువతులను మోసం చేస్తున్న కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23)ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఖరీదైన కార్లు, పబ్‌లలో దిగిన ఫొటోలను చూపిస్తూ తాను రిచ్ ఫ్యామిలీకి చెందినవాడినని నమ్మించి చాటింగ్ ద్వారా అమ్మాయిలకు దగ్గరయ్యేవాడు. తరువాత ప్రేమ పేరుతో లోబరుచుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 మందికి పైగా యువతులను అర్జున్ మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధిత యువతుల ఫిర్యాదుతో నిందితుడిపై మరో 3 కేసులు నమోదు చేశారు. మరో కేసును నార్సింగి పీఎస్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై వినోద్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు.
బ్లాక్మెయిల్ చేసి భారీగా వసూళ్లు..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడికి చెందిన ఆజాద్ అలియాస్ అర్జున్ ప్రస్తుతం మియాపూర్‌లో ఉంటున్నాడు. ధనవంతుల ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్స్, వాచ్మెన్, ఇతర సిబ్బందితో పరిచయం పెంచుకుని వారికి కొంత నగదు ఇస్తూ ఆ ఇంట్లోని బాలికలు, యువతుల్ని ట్రాప్ చేసేవాడు. నిందితుడు అర్జున్ కేవలం సోషల్ మీడియా చాటింగ్‌కే పరిమితం కాలేదు. బాలికలు, యువతులతో ఏకాంతంగా ఉన్న గడిపిన సమయంలో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసేవాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకున్న వారికి ఆ ప్రైవేట్ వీడియోలు చూపించి బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడు. వారి వద్ద నుంచి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసేవాడు.
మరి ఇప్పుడెలా దొరికిపోయాడు
జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక 15 ఏళ్ల బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. తరువాత మాయమాటలతో బాలికను లోబరుచుకున్నాడు. రాత్రివేళ ఎవరూ లేని సమయంలో ఇంటికెళ్లి బాలికను కలిసేవాడు. ఇది గమనించిన బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసులో జైలుకు వెళ్లినా, బయటకు వచ్చాక మళ్లీ ఆ బాలికను వేధించాడు.
వారి డ్రైవర్ కృష్ణ, అతడి భార్య సరస్వతి సెల్ఫోన్లలో ఆ బాలిక నిందితుడు అర్జున్‌తో తరచుగా మాట్లాడేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో నిందితుడు ఏకాంతంగా గడిపేవాడు. ఈ విషయం ఇంట్లోవాళ్లకు చెబుతానంటూ డ్రైవర్ భార్య బాలికను బెదిరించింది. మరోవైపు అర్జున్ కూడా బెదిరించడంతో ఇంట్లో దాచిపెట్టిన రూ.29 లక్షల నగదును చోరీ చేసిన బాలిక తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న అర్జున్‌కు రూ.13 లక్షలు ఇవ్వగా, డ్రైవర్ భార్య సరస్వతికి 10 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదు చేశారు.
నార్సింగికి చెందిన మరో యువతిని కూడా నిందితుడు మోసం చేశాడు. గుంటూరులో కాలేజీలో చేరేందుకు వెళ్లిన ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి శారీరకంగా కలిశాడు. తరువాత పలుమార్లు ఇద్దరూ పబ్‌లు, హోటళ్లకు వెళ్లారు. ఆ తరువాత ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి గోల్డ్ చైన్ కాజేశాడు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాలని, వారి చర్యలు కొంచెం భిన్నంగా, అనుమానంగా కనిపిస్తే విషయాలు ఆరాతీయాలని లేకపోతే దారుణాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.
Also read
- రైఫిల్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
- నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే నడి రోడ్డుపై…
- ఆత్మకు ఆకలి వేస్తుందా..? మాసికాలు ఆత్మ ఆకలి తీరుస్తాయా..? గరుడపురాణం ఏం చెప్తుంది..?
- అనవసర విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి
- లవర్‌కు మరొకరితో వివాహం జరిగిందన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య





