Vangalapudi Anitha: సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపుతున్నాయి. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన కామెంట్స్పై.. రాజధాని ప్రాంత మహిళలు, రైతులు భగ్గుమన్నారు. ఇది యావత్ రాజధాని ప్రాంత వాసులు అవమానపరచమేడనని మండిపడ్డారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కేసులు నమోదు చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచాయని, వారి భూములను త్యాగం చేసిన రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. కృష్ణంరాజు వ్యాఖ్యలకు నిరసనగా.. ఆయన ఫోటోలను చెప్పులతో కొడుతూ మహిళలు ఆందోళన తెలిపారు
అమరావతి రాజధానిపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అనేక విజయం సంఘాలు సైతం అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది మమ్మాటికి రాజధానిపై కుట్రేనని అందులో భాగంగానే.. ఇలాంటి తప్పుడు ప్రచారంతో.. అమరావతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కాకినాడలో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి జేఏసీ సైతం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే.. తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతామంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచాయని, వారి భూములను త్యాగం చేసిన రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని వారు ఆరోపించారు.
తాజాగా ఆ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ఎడిటర్ అసోసియేషన్ కీలక వ్యక్తి అయ్యి ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ గౌరవాన్ని భగ్నపరిచేలా సాక్షిలో మాట్లాడారు. అమరావతిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణం అని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ ప్రజలకు, అమరావతి ప్రజలకు జగన్, భారతి లు క్షమాపణ చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.
మరోవైపు రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని గురించి… ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
మరోవైపు రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని గురించి… ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తన సొంత మీడియా ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఖండించక పోవడం విచారకరమని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలు గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. టీవీ డిబేట్లో కృష్ణంరాజు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీటీపీ నాయకులు తిరుపతి ఎస్పీకి కంప్లెంట్ చేశారు. జర్నలిస్ట్ వ్యాఖ్యల వెనుక జగన్ ప్రమేయం ఉందని ఆరోపించారు ఎపి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మ. అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని.. యావత్ స్త్రీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కృష్ణంరాజు, యాంకర్ కొమ్ముల శ్రీనివాస్ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. లక్ష్మి అరెస్ట్