Vishakhapatnam: విశాఖపట్నం నగరం గాజువాక పరిధిలో ఒక డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. చిన్నగంట్యాడ ప్రాంతంలోని ఒక గ్యాస్ ఏజెన్సీలో అప్పారావు అనే వ్యక్తి డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు సరఫరా చేయాల్సిన అతడు, అందరినీ బురిడీ కొట్టించి ఏకంగా 30 గ్యాస్ సిలిండర్లతో ఉడాయించాడు.
డెలివరీ బాయ్ అప్పారావు తన ప్లాన్ను చాలా తెలివిగా అమలు చేశాడు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో వినియోగదారుల ఫోన్కు వచ్చే ఓటీపీని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అయితే, అప్పారావు కస్టమర్ల దగ్గరకు వెళ్లి ‘సిలిండర్ బండిలో ఉంది, ఇప్పుడే తెస్తాను’ అని నమ్మబలికి, వారి మొబైల్స్కు వచ్చిన ఓటీపీలను ముందుగానే సేకరించాడు. ఇలా సుమారు 30 మంది వినియోగదారుల నుంచి వివరాలు సేకరించి, రికార్డుల్లో డెలివరీ పూర్తయినట్లు చూపించాడు.
కస్టమర్లకు ఓటీపీలు చెప్పినా సిలిండర్లు అందకపోవడంతో వారు ఏజెన్సీని నిలదీశారు. స్టాక్ తనిఖీ చేసిన ఏజెన్సీ నిర్వాహకులు, అప్పారావు 30 నిండు సిలిండర్లతో సహా కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. దీనిపై సదరు గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఆ సిలిండర్లను ఎక్కడైనా విక్రయించాడా లేక దాచిపెట్టాడా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమ్మకంగా పనిచేయాల్సిన వ్యక్తే ఇలా మోసానికి పాల్పడటంతో ఏజెన్సీ నిర్వాహకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also read
- ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్ పై దాడి
- మహిళపై అసభ్య ప్రవర్తన.. ప్రశ్నించిన కుమారుడి దారుణ హత్య
- గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారీ
- భార్యతో గొడవ.. అడొచ్చిన అత్తను చంపిన అల్లుడు
- కృష్ణా జిల్లాలో బాలుడి హత్య.. నానమ్మకు తీవ్రగాయాలు





