కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. కొందరు ఇటుకలు, రాళ్లు, సీసాలతో దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు.
గొల్లప్రోలు, : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. కొందరు ఇటుకలు, రాళ్లు, సీసాలతో దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. పవన్ కల్యాణ్ విజయానికి సహకరించిన వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా వన్నెపూడి గ్రామ సర్పంచి కందా సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా స్థానిక దత్తాత్రేయస్వామి ఆలయం ఎదుట కొందరు వ్యక్తులు వర్మ కారును నిలిపి దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో కారులో వర్మతో పాటు తెదేపా మండల అధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, జడ్పీటీసీ మాజీ సభ్యులు మడికి సన్యాసిరావు, బర్ల అప్పారావు తదితరులున్నారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ హనుమంతరావు, సీఐ శ్రీనివాస్, ఎస్సై బాలాజీ పరిశీలించి వర్మతో మాట్లాడారు. కొంతమంది తన కారుపై రాళ్లు, సీసాలతో దాడి చేశారని వర్మ తెలిపారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు భయపడేది లేదన్నారు. దాడిని నిరసిస్తూ గొల్లప్రోలు పోలీసే స్టేషన్ ఎదుట తెదేపా కార్యకర్తలు ధర్నా చేశారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





