వరంగల్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి బాలికతో ఓ సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లి దండ్రులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పూర్తి వివరాలు
వరంగల్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి బాలికతో ఓ సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికపై ఆ సీఐ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లి దండ్రులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వడ్డేపల్లిలోని పీజీఆర్ లేక్‌వ్యూ టవర్స్‌లో ఉంటున్న రవికుమార్ కాజీపేట సీఐ గా పనిచేస్తున్నాడు. సీఐ ఉంటున్న ఫ్లోర్‌లోనే నాలుగేళ్ళ బాలిక కుటుంబం నివాసం ఉంటున్నారు. పార్ట్‌మెంట్‌లో ఉన్న ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న బాలికను చూసిన సీఐ.. తనతో ఎందుకు మాట్లాడుతున్నావు, అతన్ని పంపించి…
ఇంట్లోకి రా అంటూ బాలికను బెదిరించాడు. భయంతో ఆ బాలిక సీఐ ఇంట్లోకి వెళ్ళింది.
బెడ్‌రూంలోకి లాక్కెళ్లి..
దాంతో సీఐ బాలికపై చేయి వేసి బెడ్‌రూంలోకి లాక్కెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో సీఐ నుంచి తప్పించుకున్న బాలిక.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు హుటాహుటిన వెళ్లి కాజీపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- మీ కలలో ఇవి కనిపిస్తే లక్ష్మీ దేవి మీ ఇంటికి వచ్చినట్లే..! ఇక డబ్బే.. డబ్బు..!
- Garuda Puranam: మీ జీవితాన్ని మార్చేసే పది సూత్రాలు..! మీ కష్టాలన్నీ దూరం అవుతాయి..!
- Shani Planet: ఈయన భక్తులను ఏలినాటి శని కూడా టచ్ చేయలేదు.. జాతకం ఎలా ఉన్నా వీరికి మాత్రం రాజభోగాలే
- Best Friend Rasi: రాశిచక్రం ఆధారంగా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోండి
- సాయం చేసినోడ్ని చంపి చేయి నరుక్కుపోయారు.. ఎందుకంటే..?