డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యం వికటించినందునే వెంకటేష్ మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
AP Crime : అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సంజీవని గుండె ఆస్పత్రిలో వైద్యం వికటించి రోగి మృతి. మృతుడి బంధువులు మృతదేహాన్ని ఆస్పత్రి ముందు ఉంచి ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. బాధితుని వివరాల ప్రకారం.. పెద్దపంజాణి మండలం రాయలపేట పంచాయతీ నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఆర్ వెంకటేష్ (58) రెండు రోజుల క్రితం గుండె నొప్పితో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. రోగిని పరీక్షలు నిర్వహించి డాక్టర్లు అత్యవసరంగా స్టంట్ వేయాలని తెలిపారు
అందుకు అంగీకరించి డబ్బు కట్టి వెంకటేష్ యాంజియో గ్రామ్ చేయించారని తెలిపారు. అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లిన వెంకటేష్‌కు గుండెలో నొప్పి రావడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. రోగికి మెరుగైన వైద్యం కోసం సిటీకి పంపాలని డాక్టర్ కోరినా పట్టించుకోలేదు. అంతేకాకుండా రెండో సారీ ఆపరేషన్ చేస్తానని చెప్పి తిరిగి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆపరేషన చేస్తున్న సమయంతోనే రోగికి హార్ట్ ఎటాక్ వచ్చింది. రోగి ఆపరేషన్ థియేటర్లో మృతి చెందాడు. అయితే వెంకటేష్ మృతి చెందిన విషయం బంధువులకు కూడా చెప్పకుండా హడావుడిగా మృతదేహాన్ని అంబులెన్స్ ఎక్కించే ప్రయత్నం చేశారు డాక్టర్లు.
దీనికి కుటుంబ సభ్యులు ఆవేశంతో మృతదేహాన్ని ఆస్పత్రి గేటు ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. డాక్టర్ కావాలనే మా తండ్రిని చంపేశాడని మృతుడి కుమారుడు గణపతి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు గంటసేపు ఆందోళన చేయగా టూటౌన్ సీఐ రామచంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుడి బాధితులతో మాట్లాడి.. మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ వెల్లడించారు.
Also Read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





