కాంబోడియా మానవ అక్రమ రవాణా ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని విశాఖ నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఆ దేశంలో ఉన్న పలు చైనా సంస్థల దగ్గర 158 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్టుడే: కాంబోడియా మానవ అక్రమ రవాణా ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని విశాఖ నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఆ దేశంలో ఉన్న పలు చైనా సంస్థల దగ్గర 158 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 68 మందిని సురక్షితంగా తీసుకురాగా మరో 25 మంది స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ ‘ఈ కేసులో దేశవ్యాప్తంగా 21 మంది ఏజెంట్లు ఉన్నారు. వీరిలో ఓ మహిళ సహా 12 మందిని అరెస్టు చేశాం. కంపెనీల పేరిట నకిలీ బ్యాంకు ఖాతాలను సరఫరా చేస్తున్న వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం. ఆరుగురు ఏజెంట్లపై లుక్ అవుట్ సర్టిఫికెట్లను జారీ చేశాం’ అని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులంటూ మభ్యపెట్టి కాంబోడియా ముఠా విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నుంచి రూ. 46 లక్షలు, ఒక వ్యాపారి నుంచి రూ.1.12 కోట్ల పెట్టుబడులను పెట్టించి మోసం చేసిందని సీపీ వెల్లడించారు.
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!