హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఓ బాధితుడికి టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ పరిధిలో ఓ వ్యక్తి సెల్ఫోన్లో ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తుండగా ‘లేటెస్ట్ సినిమాలు ఫ్రీగా చూడండి, ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి’అనే ప్రకటన కనిపించింది. ఆ ప్రకటనలో కనిపించిన లింక్పై బాధితుడు క్లిక్ చేయగా.. gdpr. tubi. tv వెబ్సైట్ తెరుచుకుంది. అందులోంచి యాప్ను డౌన్లోడ్ చేసుకుని సినిమా కూడా చూశాడు. కానీ, కొద్దిసేపటికే బాధితుడి ఫోన్లో సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నట్లు కనిపించింది. కొన్ని నిమిషాల తర్వాత మొబైల్ సరిగా పనిచేయకపోవడం, యూపీఐ సేవలు 1 స్పందించకపోవడం, ఇతర యాప్లు తెరుచుకోకపోవడంతో ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే బ్యాంక్ ఖాతాలను పరిశీలించాడు. తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.80 వేలు, తల్లి బ్యాంక్ ఖాతా రూ.95 వేలు డెబిట్ అయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also read
- రోడ్డు దాటుతుండగా విషాదం..!
- ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
- అమ్మా.. నా మనసు విరిగిపోయింది!
- భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం
- కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!





