మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం..
కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగుతున్న కుట్రా…
విజయవాడ దుర్గ గుడిలో విధులు నిర్వహించేందుకు వెళుతున్న మీడియా కెమేరా మెన్ పైన పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం విజయవాడ మీడియా ప్రతినిధులలో ఆగ్రహానికి గురి చేస్తుంది. బహిరంగంగానే, దౌర్జన్యం చేస్తున్నారు. చొక్కా పట్టుకుని మరీ నెడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురు పోలీసులు ఒక మీడియా ప్రతినిధిని చుట్టుముట్టారు. ఇటు ఎందుకు వచ్చావంటూ గట్టిగా అరుస్తూ ఎంతో బరువైన కెమేరా బ్యాగును మోసుకుని వస్తున్న కెమెరా మేన్ ను తోయడంతో సదరు కెమేరా మెన్ కింద పడబోయాడు. అంతలో మరో పోలీసు పట్టుకున్నాడు. పోలీసుల అహంకారానికి అద్దం పట్టే విదంగా ఉన్న ఈ చర్యతో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. విజయవాడలో మీడియా ప్రతినిధుల పరిస్తితే లా ఉంటే సామాన్య భక్తుల పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాదారణ భక్తుల మాదిరిగా పోలీసు కమీషనర్, కలెక్టర్ లు క్యూ లైనులో దర్శనానికి వెళుతూ ఫోటోలు దిగుతున్నారు. కానీ అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తూ.. సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేస్తున్న మీడియా ప్రతినిధుల పైన పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని పాత్రికేయ సంఘాలు ఖండిస్తున్నాయి. మీడియా ప్రతినిధుల పైన దౌర్జన్యానికి పాల్పడిన ఈ పోలీసులపై ఏ చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ వారు ప్రశ్నింస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న పోలీసులకు దౌర్జన్యం చేయమని మీడియా ప్రతినిధులపై జులుం ప్రదర్శించమని ఎవరు ఆదేశాలు ఇచ్చారో అర్ధం కావడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర హోం మంత్రి అనిత, రాష్ట్ర డిజిపి ఈ పోలీసుల చర్యలను కూటమీ ప్రభుత్వ పెద్దలు సమర్థిస్తారా లేదా చర్యలు చేపడతారా చూడాలి. ఆ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!