కడప : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని కన్నెలూరు, నేతాజీనగర్లో కలుషిత నీరు తాగి సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని కొన్ని వార్డులకు చెందిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా తాగునీరు మురికిగా, దుర్వాసనతో వస్తుందని నగర పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025