రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్‌పురా బ్రిడ్జి కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Hyd crime: అది 2019 నవంబర్.. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ దగ్గర 26 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం దారుణంగా హత్య చేశారు! అత్యాచారం చేసిన తరువాత యువతి మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లి ఒక బ్రిడ్జి కింద పడేసి తగలబెట్టారు. ఆ సమయంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది! అయితే సరిగ్గా ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్‌పురా బ్రిడ్జి కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసున్న యువతిగా గుర్తించారు.మూడు రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూ టీమ్ సహాయం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాగమణి మిస్సింగ్ మిస్టరీ.. భర్త సంచలన ప్రకటన.. అసలేం జరిగింది?
- తల్లితో కలిసి బంగారు షాపునకు వెళ్లిన చిన్నారి.. చివరకు ప్రాణాలు కోల్పోయిన విషాదం!
- పెళ్లైన నెల రోజులకే వెంటాడిన మృత్యువు.. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా..
- Hyderabad: రూ.30 వేలకు మైనర్ బాలిక అమ్మకం.. చిన్న క్లూతో బయటపడ్డ పెద్ద యవ్వారం!
- పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు!





