April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

రాజమండ్రి బస్ యాక్సిడెంట్‌ ఘటన: 4 రోజులు మృత్యువుతో పోరాడి మరో యువతి మృతి!

నాలుగు రోజుల క్రితం రాజమండ్రి హైవేపై తెల్లవారు జామున బస్సుల ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా.. వారు ప్రయాణిస్తున్న బస్సు రోడ్డుపై పల్టీలు కొడుతూ అల్లంత దూరంలో బోల్తా పడిన సంఘటన తెలిసిందే. ఈ ప్రమాదంతో ఒకరు మృతి చెందగా.. దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందారు..

రాజమండ్రి, జనవరి 27: రాజమండ్రిలో బుధవారం తెల్లవారు జామున వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్‌ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. 28 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈల్లా దీక్షిత (22) అనే యువతి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సుజాతనగర్‌కు చెందిన దీక్షిత, మర్రిపాలెనికి చెందిన ఆమె బంధువు కల్యాణి.. ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ నిమిత్తం విశాఖ నుంచి హైదరాబాద్‌కు కావేరి ట్రావెల్స్‌ బస్‌లో జనవరి 22న బయలుదేరారు. రాజమండ్రి వద్దకు వెళ్లేసరికి బస్‌ ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది.


ఈ ప్రమాదంలో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ప్రమాదంలో గాయపడిన దీక్షితను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. అప్పటి నుంచి నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దీక్షిత ఆదివారం మరణించింది. దీంతో దీక్షిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక ఇంతటి ప్రమాదానికి కారణమైన కావేరి ట్రావెల్స్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

కాగా రాజమండ్రి దివాన్ చెరువు హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు గత గురువారం తెల్లవారు జామున వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో కళ్యాణి (21) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు బస్సులోని ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 28 మంది ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో మరొక యువతి తాజాగా మరణించింది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా  డ్రైవర్ బస్ నడిపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Also Read

Related posts

Share via