విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. కోరాపుట్ జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారి పతిఖిల అలియాస్ గురు ఆస్తులు ఫ్రీజ్ చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు. అక్రమ రవాణా ద్వారా సంపాదించిన 43 లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వ్యాపారులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.
విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ వైపు గంజాయి అక్రమ రవాణాపై ముమ్మర దాడులు చేస్తూ మరోవైపు భవిష్యత్తులో గంజాయి స్మగ్లింగ్ వైపు కన్నెత్తి చూడకుండా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ప్రధాన నిందితుల ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం బసుపుట్ గ్రామానికి చెందిన పతిఖిల అలియాస్ గురు (32) అనే గంజాయి వ్యాపారి ఆస్తులను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అతను గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన 43 లక్షల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది అక్టోబర్ 6న ఎస్ కోటలో ఇద్దరు వ్యక్తులు 200 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. వారి సమాచారం మేరకు పతిఖిలను అక్టోబర్ 10న పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విచారణలో అతడు గంజాయి అక్రమ రవాణాతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినట్టు తెలిసింది. ఆ డబ్బుతో కోరాపుట్‌లో నలభై లక్షల విలువైన ఇంటిని నిర్మించడంతో పాటు, లక్షన్నరతో ఆటో, లక్షకు పైగా నగదుతో టీవీఎస్ అపాచే బైక్‌ను కొనుగోలు చేశాడు. అలాగే ఏప్రిల్ 2023లో అతని బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా 38.28 లక్షలు జమైనట్టు గుర్తించారు. మరోవైపు, గంజాయి వ్యాపారుల నుంచి రూ.6.87 లక్షల నగదు కూడా ఖాతాకు జమైంది. వీరందరికీ ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పతిఖిల సంపాదించిన ఆస్తులన్నీ చట్టపరంగా ఫ్రీజ్ చేసి, ఎవరికీ విక్రయించకుండా నోటీసులు జారీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ ఆస్తులు కోలకతాలోని కాంపిటెంట్ అథారిటీ పరిధిలో ఉండటంతో వాటిని కొనుగోలు చేసినా చెల్లవని హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే భవిష్యత్తులో మరిన్ని చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.
Also read
- వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి చూడగా..
- పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. రెప్పపాటులో స్కూటీ డిక్కీలో రూ.8 లక్షలు మాయం..!
- నడిరోడ్డుపై బైక్‌పై విన్యాసాలు వద్దన్న పాపానికి.. వాహనదారులపై రెచ్చిపోయిన పోకిరిలు..!
- Ugadi Rasi Phalalu: పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయంతో పాటు అదృష్ట సంఖ్యలు, రోజులు వివరాలు!
- Lifestyle: రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ ఒక్క మంత్రం చదివితే చాలు గాఢ నిద్రలోకి.. అద్భుతమైన ఫార్మూలా!





