హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ (29), సోనమ్ (25) జంట అనూహ్య రీతిలో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజా రఘువంశీ డెడ్‌బాడీ అనుమానాస్పద స్థితిలో దొరకడం, సోనమ్ కనిపించకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులు అన్నీ పక్కాగా ప్లాన్ చేశారు. కానీ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ జంట స్టే చేసిన హోటల్‌కి వెళ్లగా..
షిల్లాంగ్, జూన్ 13: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి పేరిట స్వయానా సొంత భార్య.. తన భర్తను కిరాతకంగా హత్య చేయించడం విస్తుగొలిపేలా ఉంది. అయితే ఈ కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోరి వచ్చింది. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ (29), సోనమ్ (25) జంట అనూహ్య రీతిలో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజా రఘువంశీ డెడ్‌బాడీ అనుమానాస్పద స్థితిలో దొరకడం, సోనమ్ కనిపించకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులు అన్నీ పక్కాగా ప్లాన్ చేశారు. కానీ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ జంట స్టే చేసిన హోటల్‌కి వెళ్లడంతో అక్కడ దొరికిన క్లూ అన్ని అనుమానాలకు సమాధానంగా మారింది. అదేంటంటే..
ఈ జంట బసచేసిన హోటల్ గదిలో ఒక సూట్‌కేసులో మంగళసూత్రం, ఉంగరం లభించాయి. కొత్తగా పెళ్లైన సోనమ్ హనీమూన్ సమయంలో మంగళసూత్రం గదిలో వదిలి వెళ్లడం పోలీసుల బుర్రకు పనిచెప్పినట్లైంది. ఆ మంగళసూత్రమే ఆ తర్వాత దర్యాప్తులో నిందితురాలిని పట్టించాయని పోలీసులు తెలిపారు. ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశామని, అప్పుడే అసలు నిందితురాలు సోనమ్‌గా తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించారని వెల్లడించారు. ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్తను హత్య చేయించినట్లు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని, అతడు సోనమ్ ప్రేమికుడని తేలింది. నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
మరోవైపు మే 23న మరో హోమ్‌స్టేలో కాపుగాచి కాంట్రాక్ట్ కిల్లర్లు ఉన్నారు. దీంతో సోనమ్ ఫోటోలు తీసుకునే నెపంతో రాజాను హోమ్ స్టే నుంచి బయటకు తీసుకొచ్చింది. అక్కడ ఆమె ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ దూరంగా నిలబడి ఉంది. ఇంతలో కాంట్రాక్ట్ కిల్లర్లు వెనుక నుంచి రాజా రఘువంశీని అంతమొందించారని పోలీసు అధికారి మారక్ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. హంతకులు రెండు స్కూటీలను వినియోగించగా.. ఘటన అనంతరం సోనమ్ ఒక నిందితుడి స్కూటీపై పరారైంది. మిగిలిన ఇద్దరు నిందితులు మరో స్కూటీలో వెళ్లిపోయినట్లు తెలిపారు
Also read
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025