విజయవాడలోని రామవరప్పాడు రింగ్ దగ్గర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కాగా, వారి నుండి సెల్ ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన రింకు నుండి డ్రగ్స్ కొరియర్ల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు విచారణలో తేలింది.
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. బుధవారం రాత్రి నిర్వహించిన పోలీసు తనిఖీల్లో అనూహ్యంగా 33 గ్రాముల ఎండీఎంఏ బయటపడింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న.. పోలీసులు వారి నుండి సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రగ్స్ మూలాలు కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
విజయవాడలోని రామవరప్పాడు రింగ్ దగ్గర అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రామవరప్పాడు ఫ్లై ఓవర్ వైపు నుండి విజయవాడ వైపు అనుమానాస్పదంగా వెళుతున్న రెండు వాహనాలను తనిఖీ చేశారు. ఓ ఇనుప పెట్టెలో వైట్ కలర్ క్రిస్టల్ MDMA డ్రగ్స్ ప్యాకెట్లు రెండు, పర్పుల్ కలర్ క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్స్ ప్యాకెట్ ఒకటి, రెడ్ కలర్ క్రిస్టల్ ఎండీఎంఏ అడ్రస్ ప్యాకెట్ ఒకటి మొత్తం సుమారు 33 గ్రాముల డ్రగ్స్ లభించాయి. రెండు బైకులతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
నూజివీడుకు చెందిన మనోహర్ ద్వారా ఢిల్లీకి చెందిన రింకు నుండి ట్రాక్ ఆన్, డీటీడీసీ కొరియర్ల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో సనత్ నగర్ కు చెందిన తిరుమలశెట్టి జీవన్ కుమార్, టీచర్స్ కాలనీకి చెందిన బొంతు నితీశ్ కుమార్, యనమలకుదురుకు చెందిన తరుణ్ ప్రసాద్‌లు ఉన్నారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





