కడప జిల్లా రామచంద్రపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొని పాచికలపాడు గ్రామానికి చెందిన వీఆర్వో ఈశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kadapa Crime: కడప జిల్లా తాడిపత్రి మండలం రామచంద్రపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొనడం వల్ల ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని పాచికలపాడు గ్రామానికి చెందిన వీఆర్వో ఈశ్వరయ్య (55)గా పోలీసులు గుర్తించారు. ఆయన చదిపిరాళ్ల సచివాలయానికి వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విధులకు హాజరుకావడానికే వెళ్లిన ఈశ్వరయ్య.. మార్గమధ్యంలో లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం, ఈశ్వరయ్య మృతదేహాన్ని కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వేధింపులు తట్టుకోలేక..
అయితే ఈ ఘటన తర్వాత ఆస్పత్రిని సందర్శించేందుకు వచ్చిన మండల రెవెన్యూ అధికారి శివరామిరెడ్డిపై మృతుడి బంధువులు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. ఈశ్వరయ్య ఆరోగ్యం సరిగా లేని సమయంలోనూ సెలవు మంజూరు చేయకుండా మరో సచివాలయానికి ఇన్చార్జ్గా నియమించడం, తీవ్ర ఒత్తిడి కలిగించడమే ఆయన మృతికి కారణమని బంధువులు ఆరోపించారు. ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలోనే అదనపు బాధ్యతలు, వేధింపుల గురించి చెబుతూ బాధపడిన ఈశ్వరయ్య చివరికి విధులకు వెళ్తుండగా మృత్యువుకు లోనయ్యాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూశాఖ అధికారుల విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల దృష్టి సారించకుండా అధిక పనిభారం వేయడం వల్లే ఇలా విషాదం చోటుచేసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈశ్వరయ్య మరణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!





