SGSTV NEWS
Andhra PradeshCrime

Atmakur Forest Scam: ఆత్మకూరు ఫారెస్ట్‌ కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్.. కోట్లకు కోట్లే గుటకాయ స్వాహా!



నంద్యాల జిల్లా అటవీ శాఖలో చోటుచేసుకున్న భారీ కుంభకోణాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు. అకౌంట్ ఆఫీసర్ చాంద్ బాషా.. అటవీ శాఖలోని చెక్ పోస్టుల నుంచి వచ్చే డబ్బులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులను పెద్ద ఎత్తున సొంతానికి వాడుకున్నారు. ఇందులో బ్యాంక్ అధికారుల..

నంద్యాల, జులై 22: అడవి దొంగలను పోలీసులు పట్టేశారు. తినింది ఎంతో కూడా చెప్పారు. ప్రస్తుతానికి రూ.4.37 కోట్లుగా నిర్ధారించారు. ఒకరికి ముందస్తు బెయిల్ రాగా మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. మిగిలిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నంద్యాల జిల్లా అటవీ శాఖలో చోటుచేసుకున్న భారీ కుంభకోణాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు. అకౌంట్ ఆఫీసర్ చాంద్ బాషా.. అటవీ శాఖలోని చెక్ పోస్టుల నుంచి వచ్చే డబ్బులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులను పెద్ద ఎత్తున సొంతానికి వాడుకున్నారు. ఇందులో బ్యాంక్ అధికారుల ప్రమేయం కూడా ఉంది. ప్రధాన నిందితుడిగా ఉన్న చాంద్ భాషా కి ముందస్తు బెయిల్ వచ్చింది.

ఈరోజు ప్రింటింగ్ ప్రెస్ యజమాని వెంకట శివయ్య, చాంద్ బాషా బంధువు మక్బుల్ భాష అరెస్టయ్యారు. వెంకటేష్ శివయ్య భార్య ఆయన తల్లిపై కూడా కేసు నమోదు అయింది. ప్రధాన నిందితుడు చాంద్ బాషా సోదరిలు ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. అటవీ శాఖకు చెందిన డబ్బులను బ్యాంకు నుంచి ప్రింటింగ్ ప్రెస్ వెంకట శివయ్య కుటుంబీకుల పేరు మీద, తన కుటుంబీకుల పేరు మీద డబ్బులు డ్రా చేసినట్టు తేల్చారు. మొత్తం ఏడుగురు నిందితులు తెరపైకిరాగా.. వీరిలో ఇద్దరు అరెస్టు అయ్యారు. ఒకరు బెయిల్ పై ఉన్నారు. మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. కుంభకోణం విలువ ప్రస్తుతానికి రూ.4.37 కోట్లుగా తేల్చారు. విచారణలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయ స్పష్టం చేశారు.

ప్రధాన నిందితుడు చాంద్ బాషా రిటైర్ కావడంతో… ఆయన స్థానంలో వచ్చిన అకౌంట్ ఆఫీసర్ రాజుకి లెక్కల్లో తేడా వచ్చింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది.


Also read

Related posts

Share this