ఇండియా…పాక్ దేశాల మధ్య జరుగుతున్న వరుస దాడులతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు, ఎయిర్పోర్ట్లు, పోర్టు లతో పాటు అంతరిక్ష కేంద్రాలపై దాడులు జరుగుతాయనే ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అప్రమత్తం ఐయ్యారు. ముఖ్యంగా ఇస్రో లో కీలక భాగమైన శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తో పాటు బెంగుళూరు లోని ప్రధాన కేంద్రంలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు.
భారత్ , పాక్ మధ్య జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్ పై వరుస దాడులు చేస్తున్న పాక్ ప్రముఖ కట్టడాలతో పాటు, పోర్టులు ఎయిర్ పోర్టులపై కూడా దాడులు చేసే అవకాశం ఉందన్న అనుమానంతో చాలా చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. మరీ ముఖ్యంగా అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు సంబంధించిన శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్ వద్ద ఇస్రో భద్రతా దళాలు మొహరించారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు నడుమ నిఘా పెంచారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షారుకు సంబంధించి భద్రతా దళాలు 700 వరకు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్యను మరింత పెంచారు. సీఐఎస్ఎఫ్ భద్రత దళాలు షార్ ను నిత్యం కాపు కాస్తు ఉంటాయి. అయితే భారత్ పాకిస్తాన్ దేశాలకు నడుమ జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని శ్రీహరికోటకు సంబంధించి భద్రతా దళాలు షార్ లోని మొదటి లాంచ్ పాడ్ వద్ద, రెండవ లంచ్ పాడ్ వద్ద, మరియు రాకెట్ అసెంబ్లింగ్ బిల్డింగుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
అంతేకాకుండా శ్రీహరికోట బంగాళాఖాతం తీరంలో ఉంటుంది. దీంతో బంగాళాఖాతం సముద్ర తీరం వద్ద కూడా బందోబస్తును కట్టుదిట్టం చేయడం జరిగింది. షార్ లో పనిచేస్తున్న సుమారు 1000 మంది సిఐఎస్ఎఫ్ బాలగాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ లీవులు ఇవ్వడం లేదు. సెలవులపై బయట ప్రాంతాలకు వెళ్లిన సిఎస్ఎఫ్ బలగాలకు కూడా ఎమర్జెన్సీ ఆదేశాలను జారీచేసి వారిని కూడా తిరిగి శ్రీహరికోటకు రప్పించారు. ఏది ఏమైనా భారత్ పాక్ దేశాల మధ్య జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో శ్రీహరికోట సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రోకు సంబంధించిన 11 కేంద్రాలలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భద్రత బలగాలను పెంచి గట్టిగా నిఘా పెట్టింది.
Also read
- Telangana: అయ్యో దేవుడా.. పెళ్లైనా 6 నెలలకే ఇంత దారుణమా.. శాడిస్ట్ భర్త వేధింపులతో..
- Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..
- Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్!
- ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates
- Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..





