వారిది కడు పేద కుటుంబం. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని పెంచారు. కూడబెట్టిన సొమ్ముతో రెండో కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. అయితే ఆ ఇంట పచ్చని తోరణాలు వాడక ముందే దారుణం చోటు చేసుకుంది. చెప్పాపెట్టకుండా వచ్చిన వాన మోయలేనంత విషాదం మిల్చివెళ్లింది. అసలేం జరిగిందంటే..
విజయనగరం, జూన్ 7: విజయనగరం జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. తెర్లాం మండలం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన రామిశెట్టి అనే దుస్తుల వ్యాపారి జీవనోపాధి కోసం బట్టలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య పి వెంకటమ్మ (42) ఇంట్లోనే ఉంటూ, ఇద్దరు ఆడపిల్లలు, పశువుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఎంతో కష్టపడి, పైసా పైసా కూడ పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తున్నారు. అందులో భాగంగా రెండో కుమార్తె గౌరి పెళ్లి మే 20న ఘనంగా జరిగింది. వీరి ఇంట్లో పెళ్లి లాంఛనాలు, పెళ్లి సందడి ముగియక ముందే విషాదం వీరి కుటుంబాన్ని చుట్టుముట్టింది.
శుక్రవారం రోజు వెంకటమ్మ ఇంటికి సమీపంలోని పశువులశాలలో ఉన్న పశువులకు దాణా పెడుతుండగా, అకాల వానలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇది చూసిన చుట్టుపక్కలవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పిడుగు ప్రమాదంతో ఒక సామాన్య కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండో కుమార్తె వివాహం జరిగిన కుటుంబంలో తల్లి మరణం కుటుంబ సభ్యులను కుంగదీసింది. పచ్చని పందిరి వేసిన అదే ప్రాంగణంలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా విషాదంలో మునిగింది. ప్రభుత్వం కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని అండగా నిలవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధికారులు స్పందించి వెంకట లక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..