తిరుపతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ పై కేసు నమోదు అయ్యింది. యూట్యూబర్ కల్లూరి హేమాద్రి తోపాటు నాగవర్ధిని అనే మహిళ పై కూడా తిరుచానూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తిరుపతి రూరల్ మండలం మంగళం క్వార్టర్స్‌లో ఉంటున్న యువతిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదు అందింది.
తిరుపతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ పై కేసు నమోదు అయ్యింది. యూట్యూబర్ కల్లూరి హేమాద్రి తోపాటు నాగవర్ధిని అనే మహిళ పై కూడా తిరుచానూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తిరుపతి రూరల్ మండలం మంగళం క్వార్టర్స్‌లో ఉంటున్న యువతిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హేమాద్రి ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ ద్వారా యువతికి అసభ్య మెసేజ్‌లు చేసి ఇబ్బంది పెట్టినట్లు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో బాధితురాలు పేర్కొంది. గత 5 నెలలుగా తన కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నువ్వంటే పిచ్చని లొంగకపోతే జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసింది. లేదంటే కుటుంబ సభ్యులను కూడా చంపుతానని బెదిరించినట్లు పోలీసులకు బాధితురాలు తెలిపింది.
ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని కల్లూరి హేమాద్రి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. మంగళం క్వార్టర్స్ లో ఉన్న వివాహితను నాగవర్ధిని ఇంటికి పిలిపించి బెదిరించిన యూట్యూబర్ కల్లూరి హేమాద్రి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు యూట్యూబర్ హేమాద్రి అతని సన్నిహితురాలు నాగవర్ధని ఇద్దరినీ అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





