SGSTV NEWS
Andhra PradeshCrime

కారులో ఓ యువకుడు.. ఇద్దరు మహిళలు.. అనుమానం వచ్చి చెక్ చేయగా పోలీసులకు మైండ్ బ్లాంక్..

కారులో ఓ యువకుడు.. ఇద్దరు మహిళలు.. మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.. వారంతా కుటుంబసభ్యులని అనుకోవడం కామన్.. కానీ.. వారంతా ఇక్కడి వారు కాదు.. పక్క రాష్ట్రానికి చెందిన వారు కావడంతో.. ఎక్కడో తేడా కొడుతున్నట్లు అనిపించింది.. ప్రశ్నించడంతో తడబడుతూ సమాధానం చెబుతున్నారు.. దీంతో అనుమానం మరింత బలపడింది. దీంతో పోలీసులు.. వారందరినీ.. కారులోంచి కిందకు దింపారు.. ఏవేవో సమాధానాలు చెబుతూ… తాము ఢిల్లీకి చెందిన వారమంటూ పేర్కొన్నారు.. ఇటు ఎందుకొచ్చారు..? ఏంటి అంటూ ఆరా తీస్తూనే పోలీసులు కారును క్షుణ్ణంగా పరిశీలించారు.. ఇంకేముంది.. దానిలో చిన్న చిన్న ప్యాక్ చేసిన ప్యాకెట్లు కనిపించారు. కట్ చేస్తే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కింటాన్నర గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది..

గంజాయి స్మగ్లింగ్‌పై ఏపీ పోలీసులు డేగ కన్నేయడంతో స్మగ్లింగ్‌ బ్యాచ్‌ ట్రెండ్‌ మార్చింది. చిన్నపిల్లల తల్లులతో గంజాయి తరలింపునకు ప్రయత్నిస్తోన్న ఢిల్లీ గ్యాంగ్‌ గుట్టురట్టు చేశారు అల్లూరి జిల్లా పోలీసులు.. వై.రామవరం మండలం గుర్తేడు దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులకు.. 150కేజీల గంజాయిని ప్యాకెట్లలో తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. అనుమానం రాకుండా చిన్న పిల్లల తల్లులతో గంజాయి తరలింపునకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు ఢిలీ బ్యాచ్‌..

కారులో గంజాయ్ తో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నపిల్లల తల్లులను, ఒక యువకుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి దగ్గర నుంచి 10వేల నగదు, రెండు మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉండడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


అరెస్టయిన వారు ఢిల్లీకి చెందిన సోబరతిన్న్ (28), జాహిద్ (19), ముస్తఫా షేక్ (29) గా పోలీసులు గుర్తించారు. అనుమానం రాకుండా చిన్నపిల్లలతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share this