SGSTV NEWS
Astro TipsSpiritual

Amavasya 2025: రాహు కేతువులకు అసలు సిసలు బాస్.. అమావాస్య రోజున ఈ దైవాన్ని పూజిస్తే చాలు..



రాహు కేతు దోషాలు… జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇవి జీవితంలో అనేక అడ్డంకులు, సవాళ్లను సృష్టిస్తాయని నమ్మకం. అయితే, ఈ దోషాల ప్రభావాలను తగ్గించడానికి అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. మరి, అమావాస్య రోజున ఏయే పనులు చేయడం ద్వారా రాహు కేతు దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చో, శాంతి సౌభాగ్యాలను ఎలా పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం.


రాహు కేతు దోష నివారణకు అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక పూజలు దానాలు చేయడం వల్ల ఈ దోషాల తీవ్రత తగ్గుతుందని నమ్మకం.


రాహు కేతు దోషం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు కేతువు ఛాయా గ్రహాలు. ఇవి నవగ్రహాలలో ముఖ్యమైనవి. ఒకరి జాతకంలో ఈ గ్రహాలు సరిగా లేని స్థానాల్లో ఉంటే, దానిని రాహు కేతు దోషం అంటారు. ఈ దోషం వల్ల జీవితంలో అనేక అడ్డంకులు, ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, సంబంధాలలో గొడవలు వంటివి రావచ్చని నమ్మకం.

అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు:
అమావాస్య రోజును పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి, ఆధ్యాత్మిక శుద్ధికి చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. రాహు కేతు దోష నివారణకు ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం మంచిది. ఈ రోజున ఇద్దరు పేదవారికి పితృదేవతల పేరున కడుపునిండా భోజనం పెట్టడం ఈ దోషానికి తిరుగులేని రెమిడీగా నిపుణులు చెప్తున్నారు.

శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజ:
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిశ్వరాలయం రాహు కేతు దోష నివారణ పూజలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు, జ్ఞాన ప్రసూనాంబికలు రాహు కేతులుగా కొలువై ఉన్నారని నమ్మకం. అమావాస్య రోజున, ముఖ్యంగా రాహుకాలంలో ఈ పూజను చేయడం చాలా శుభప్రదం. భక్తులు ఈ రోజున ప్రత్యేకంగా రాహు కేతు పూజలు చేయించుకోవచ్చు.

పితృ తర్పణాలు దానాలు:
అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు (నీటిని సమర్పించడం) ఇవ్వడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. ఇది పితృ దోషాలను కూడా తగ్గిస్తుంది. పితృ దోషాలు కూడా రాహు కేతు దోషాలతో ముడిపడి ఉంటాయని నమ్మకం. ఈ రోజున పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, అన్నం, నువ్వులు, బెల్లం, నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం శుభప్రదం.

తిరుగులేని రెమిడీ ఇదే:
రాహు కేతువులకు శివుడు అధిపతి. ఈ దైవాన్ని పూజిస్తే కచ్చితంగా ఈ గ్రహాలు శాంతిస్తాయిని చెప్తారు. కాబట్టి అమావాస్య రోజున శివాలయాన్ని సందర్శించి శివునికి అభిషేకం పూజలు చేయడం వల్ల దోష ప్రభావాలు తగ్గుతాయి. శివ లింగానికి నల్ల నువ్వులతో అభిషేకం చేయడం కూడా మంచిది. అయితే ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలని గుర్తుంచుకోండి.

నవగ్రహ స్తోత్ర పారాయణం:
అమావాస్య రోజున రాహు గ్రహ స్తోత్రం, కేతు గ్రహ స్తోత్రం నవగ్రహ స్తోత్రాలను పఠించడం వల్ల ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.

వారాలు:
రాహు కేతువుల అనుకూలత కోసం శనివారం ఉపవాసం ఉండటం, నల్లని వస్తువులను దానం చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం వంటివి కూడా అమావాస్య రోజున చేయవచ్చు.

విశిష్ట ఆలయ సందర్శన:
శ్రీకాళహస్తితో పాటు, త్రియంబకేశ్వర్ వంటి కొన్ని ప్రత్యేక ఆలయాలలో కూడా రాహు కేతు దోష నివారణ పూజలు నిర్వహిస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయాలను సందర్శించి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాలను శ్రద్ధగా నిష్టగా ఆచరించడం వల్ల రాహు కేతు దోషాల ప్రభావం తగ్గి, జీవితంలో శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే, మీ జాతకానికి తగిన ప్రత్యేక పరిహారాల కోసం ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడిని సంప్రదించడం ఎప్పుడూ మంచిది

Related posts

Share this