July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని

విజయవాడ: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం అసలు ఏమి చేసింది?. ప్రజల సంక్షేమం గురించి ఏమి చేసింది?.. పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

విజయవాడ: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం (Jagan Govt.) అసలు ఏమి చేసింది?. ప్రజల సంక్షేమం గురించి ఏమి చేసింది?.. పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేయలేదని బీజేపీ (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని (Sadhineni Yamini) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆమె విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందని, అంగన్‌వాడీ (Anganwadi)లకు న్యాయం చేయలేకపోవటం వైసీపీ (YCP) చేస్తున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ఏపీ (AP)ని డ్రగ్స్ (Drugs), గంజాయి (Cannabis) రాష్ట్రంగా ప్రభుత్వం మార్చేసిందని, ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుందని, కొంత మంది పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని సాధినేని యామిని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. చేసేదంతా అధికారపార్టీ నేతలు చేసి.. తిరిగి ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘాలకి ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. జగన్ సొంత జిల్లా కడపకు వెళ్ళినప్పుడు 13 బలగాలను రప్పించుకున్నారని, సీఎంకు ప్రజల అండ ఉంటే ఎందుకు అంతలా బయపడుతున్నారని ప్రశ్నించారు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) చిలకలూరిపేటలో సభ నిర్వహించినప్పుడు ఐదు బలగాలను మాత్రమే పంపించారని, రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని, పరిశ్రమలు లేవని, ఉపాధి లేకుండా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని సాధినేని యామిని విమర్శించారు. కేంద్రం పంపిస్తున్న నిధులను పక్క దోవ పట్టిస్తున్నారని, సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటివన్నీ ప్రశ్నిస్తుంటే దాడులకు దిగుతున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తి గత దూషణలకు దిగడం సరికాదన్నారు. నిజమైన సంక్షేమ పాలన అందించాలంటే ప్రజలు ఎన్డీయే (NDA) కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరారు. పూర్తి స్థాయిలో కేంద్రం పంపించే నిధులను ప్రజలకు అందించాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని సాధినేని యామిని పేర్కొన్నారు.

Also read

Related posts

Share via