విశాఖ కేజీహెచ్‌లో కీచక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో బాధితురాలైన బాలిక.. వైద్య పరీక్షల కోసం వెళ్తే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉద్యోగి. బాలికకు పోర్న్ వీడియోలు చూపించి వేధింపులకు పాల్పడ్డాడు. కేజీహెచ్‌లోని గైనకాలజీ విభాగంలో ఈ దారుణం జరిగింది.
విశాఖ అరిలోవ ప్రాంతానికి చెందిన బాలికపై అదే ఏరియాకు చెందిన కొంతమంది యువకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం పోలీసులు కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి డిశ్చార్జ్ రూమ్‌లో పెట్టారు. అదే సమయంలో బాలికపై కన్నేశాడు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ దిలీప్. హెల్త్ రిపోర్ట్ పేరుతో బాలిక దగ్గరికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. పోర్న్ వీడియోలు చూపించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు బాలిక ఇంటికెళ్లిన తర్వాత కూడా పోన్ చేసి వేధించాడు. అప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న బాలిక.. దిలీప్ వేధింపులతో మరింత మనస్తాపానికి గురైంది. దాంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్ సీరియస్ అయ్యారు. దీంతో అరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడు దిలీప్‌ను అరెస్టు చేశారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





