మచిలీపట్నం
20/5/2025
కార్యకర్తలకు అండగా నిలిచే తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం మినీ మహానాడు లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి…..
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మచిలీపట్నం
నియోజకవర్గం నలుమూలల నుండి వెల్లువలా సుల్తానగరం గోల్డ్ కన్వెన్షన్ కు తరలివచ్చి మచిలీపట్నం నియోజకవర్గం మినీ మహానాడు ను పసుపుమయం చేయాలి….. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కృష్ణాజిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్, గొర్రెపాటి గోపీచంద్….
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, గొర్రె పాటి గోపీచంద్ మంగళవారం సిడింబి అగ్రహారంలో ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ…..
మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ ఒక పండుగ లాంటిదని, అలాంటి పండుగను ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు ద్వారా పార్టీ శ్రేణుల కష్టసుఖాలు, ప్రజా సమస్యలపై మరియు ఆ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి, సంక్షేమంపై కూడా పార్టీ కుటుంబ సభ్యులతో చర్చించుకుని పలు తీర్మానాలు చేసుకుని ఆ నియోజకవర్గాల తీర్మానాలను జిల్లా మినీ మహానాడులో కూడా జిల్లా సమస్యలు కూడా చర్చించుకుని, ఈనెల 27, 28, 29 తేదీలలో కడపలో నిర్వహించే మహానాడులో అన్ని నియోజకవర్గాల సమస్యలు తెలుసుకుని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు.
మహానాడులో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గం మినీ మహానాడు బుధవారం మచిలీపట్నం నియోజకవర్గం సుల్తానగరం వద్దగల గోల్డ్ కన్వెన్షన్ హాలు నందు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందని, ఈ మినీ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని పార్టీ శ్రేణుల కష్టసుఖాలు, మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమంపై పార్టీ పెద్దల సమక్షంలో చర్చించుకుని పలు తీర్మానాలు చేసుకోవడం జరుగుతుందని, కావున మచిలీపట్నం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ క్రమశిక్షణతో పాల్గొని గోల్డ్ కన్వెన్షన్ హాలును పసుపు మయం చేసి మంత్రి కొల్లు రవీంద్ర సారధ్యంలో జరిగే మన మచిలీపట్నం నియోజకవర్గం మినీ మహానాడు ను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ గొర్రెపాటి గోపీచంద్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,
ఇమ్మా బత్తుల దిలీప్ కుమార్, పి. వి. ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!