November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

భర్త చేసిన పనికి విసిగెత్తిన మహిళ.. చివరకి కన్నబిడ్డలను మరచి



పెళ్లై ఐదు సంవత్సరాలు గడిచిన తన భర్త, అత్త తీరు మారక, విసిగెత్తిన ఓ మహిళ.. చివరికి కన్నబిడ్డలను సైతం మరచి చేసిన పని స్థానికంగా తీవ్ర కలకరం రేపింది.


తరం మారినా, ట్రెండ్ మారినా.. వరకట్న వేధింపులు మాత్రం ఆగడం లేదు. నాటి నుంచి నేటి వరకు కట్నం అనే పెద్ద భూతం ఎంతోమంది ఆడపడుచుల జీవితాలను బలి తీసుకుంటుంది. దీనిపై ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన అవి నామ మాత్రంకే తప్ప, అచారించడానికి పనికిరావడం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విషయంలో సామన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల వరకు ప్రతిఒక్కరూ డబ్బు మోజులో నమ్ముకొని వచ్చిన భార్యను వేధించడం, హత్య చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. జీవితంపై విరక్తి కలిగించేలా కుటుంబంతో సహా ఇబ్బందులకు గురి చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో చాలామంది మహిళలు పెళ్లైన కొన్నాళ్లకే కట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్యులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఓ మహిళ అత్తింటిలో వరకట్న వేధింపులు భరించలేక కన్నబిడ్డలను కూడా మరచి చేసిన పని స్థానికంగా తీవ్ర కలకరం రేపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..


పెళ్లై ఐదు సంవత్సరాలు గడిచిన అత్తింటి నుంచి కట్నం వేధింపులు రోజు రోజుకి ఎక్కువవతుండటంతో.. ఓ మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. అయితే ఈ దారుణమైన ఘటన వరంగల్ మండలం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపన వివరాల మేరకు.. పైడిపల్లి గ్రామానికి చెందిన రావి రాకుల స్వాతికి(26) అదే గ్రామానికి చెందిన రావిరాకుల నిరంజన్ కు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా, ప్రస్తుతం వీరిద్దరికి ఒక పాప, బాబు ఉన్నారు.  అయితే పెళ్లైన నాటి నుంచి స్వాతికి భర్త, అత్త అదనపు కట్నం తీసుకురమ్మని వేధించేవారు.

ఈ క్రమంలోనే.. పలుమార్లు ఆ గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. అయిన సరే భర్త నిరంజన్ తీరు మారలేదు సరి కదా.. మరీ కాస్త ఎక్కువగా వేధింపులకు గురి చేసేవాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి కనీసం కన్నబిడ్డల గురించి కూడా ఆలోచించకుండా.. ఈనెల 5వ తేదీ గురువారం సాయంత్రం గడ్డి మందు తాగి తన అమ్మకు సమాచారం అందిచింది. దీంతో వెంటనే స్వాతి తల్లి వచ్చ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. ఇక అక్కడే చికిత్స పొందుతున్ స్వాతి నిన్న(సోమవారం) ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచిన కుతూరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని స్వాతి  తల్లి గుండె పగిలేలా రోదించింది. అలాగే ఎప్పటికి తన తల్లి ఇక తిరిగిరాదని తెలిసిన స్వాతి పిల్లలు.. అమ్మ కోసం క్నన్నీరుమున్నీరుగా విలపించారు.  ఇకపోతే స్వాతి మృతిపై తల్లి  తలకోట్ల యశోద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న ఎనుమాముల ఇన్స్పెక్టర్ ఏ.రాఘవేందర్  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Also read

Related posts

Share via