మియాపూర్: తొమ్మిది అంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ దుర్గా రామ లింగ ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మియాపూర్ మయూరినగర్ కాలనీ, దివ్యశ్రీ శక్తి అపార్ట్మెంట్లో భర్త నెహ్రూ, కుమారుడితో కలిసి ఉంటున్న సాయి సింధూర(29) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుంది.
శుక్రవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ తొమ్మిదో అంతస్తు నుంచి కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయి సింధూర మన స్తానికిలోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా ప్రస్తుతం ఆమె ఆరు మాసాల గర్భవతి అని తెలిసింది. మృతురాలి తండ్రి సూర్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..