ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి యాత్రకు వెళ్లారు. అనంతరం దైవ దర్శనానికి బయలు దేరారు. అంతలోనే అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్కు చెందిన ఓ కుటుంబం చేపట్టిన విహారయాత్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదం రూపంలో బాలుడిని బలిగొన్న ఘటన స్థానికంగా కలచి వేస్తోంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాళ్ల దర్శన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మూడు కార్లల్లో విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా భద్రాచలం నుంచి ములుగు జిల్లా మీదుగా తాడ్వాయి గుండా సమ్మక్క సారక్క వైపు వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తాళ్ల అరుణ్ కుమారుడు శబరీశ్(9) అక్కడిక్కడే మృతి చెందాడు.
కారు నడుపుతున్న అరుణ్, అతడి తండ్రి దర్శన్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరినీ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దర్శన్(60) పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తండ్రీతాతలు ఆస్పత్రిలో ఉండగా పిల్లాడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధం చేశారు. దీంతో కొంగరకలాన్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





