పల్నాడు : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన ఫాస్టర్లు రావెల వెంకటేశ్వర్లు (75) మొండితోక బాలశౌరి(53), రొంపిచర్ల మండలం తురుమెళ్ళ గ్రామంలో గల చర్చిలో ప్రార్థనలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో ఒంగోలు నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ వేగం తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. బాలశౌరి లారీ కింద పడి అక్కడక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన రావెల వెంకటేశ్వర్లును నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారు అయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కెపి.రవీంద్రబాబు తెలిపారు.
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





