యలమంచిలి టౌన్ (అనకాపల్లి) : అచ్చుతాపురం మండలం, పూడిమడక నుంచి చేపలు వేటకు వెళ్లి సముద్రంలో మత్స్యకారుడు తప్పిపోయాడు. ఉమ్మిడి జగన్ (గ్రామస్థులు) ప్రజాశక్తికి ఇచ్చిన వివరాల ప్రకారం …. పూడిమడక (కొండపాలెం)కి చెందిన పెనగాళ్ల సత్తయ్య మరొక ఆరుగురు కళాశీలతో కలిసి ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో చేపల వేటకు వెళ్లారు. వేట ముగిసిన తరువాత వెనక్కు వచ్చేస్తుండగా సుమారు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తీరంకి ముడువందల మీటర్లు దూరంలో ఉండగా ఒక్కసారిగా సముద్రం అల్లకల్లోలంగా మారటంతో, కుదుపుకు లోనైన పడవ తిరగబడి అందరు సముద్రంలో పడిపోయారు. కొద్దిసేపటి తరువాత జాలర్లు బోటు దగ్గరికి చేరుకున్నారు. కానీ బోటు యజమాని అయినా సత్తయ్య రాకపోవడంతో జాలర్లు సముద్రంలో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో గట్టున ఉన్నవారిని తీసుకువద్దామని వెనక్కి వచ్చేశారు. అనంతరం పూడిమడకలో అధికారులకు, మత్స్యకారులకు సమాచారం ఇచ్చి, మరల దాదాపు పది బోటులలో యాబై మంది మత్స్యకారులను వరకు వెతుకుటకు తీసుకొనివెళ్లారు
Also Read
- నేటి జాతకములు..21 మార్చి, 2026
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం





