ఖమ్మం నగరంలో ఘటన
ఖానాపురం హవేలి, న్యూస్టుడే: విష కీటకం కుట్టి అంగన్వాడీ కేంద్రంలో ఐదేళ్ల చిన్నారి మృత్యువాత పడిన ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరుకు చెందిన అయ్యదేవర రవి, స్వప్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరు ఖమ్మం పట్టణం టేకులపల్లిలో ఉంటున్నారు. పెద్ద కుమార్తె ధన్యశ్రీ(5)ని స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. రోజూలాగే సోమవారం చిన్నారిని కేంద్రంలో దించి వెళ్లారు. ఉదయం 11 గంటలకు అంగన్వాడీ ఆయా ఫోన్ చేసి ‘మీ పాప బాత్రూంకు పోయింది..రండి’ అని చెప్పడంతో తల్లి వచ్చింది. పాప ఒంటి నిండా దద్దుర్లు, కన్నువాచి ఉండటంతో ఏం జరిగిందని ప్రశ్నించింది. పక్కన ఉన్న ఓ బాలుడు ఏదో పురుగు కుట్టిందని చెప్పడంతో వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి మృతి చెందింది. అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యమే చిన్నా మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు ధన్యశ్రీ మృతదేహాన్ని మంగళవారం కేంద్రానికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి ప్రమీల బాధితులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
Also read
- అంగన్వాడీ కేంద్రంలో విష కీటకం కుట్టి చిన్నారి మృతి
- స్నేహం మాటున చిచ్చు యువకుడి హత్యపై దర్యాప్తు ముమ్మరం
- ఫొటోలు బయటపెడుతుందని.. పెళ్లి అడ్డుకుంటుందని!వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్టు
- మంచినీళ్లు అడిగాడు.. కత్తితో పొడిచాడు
- మేము తప్పు చేస్తున్నామని తెలుసు.. కానీ, వేరే మార్గం లేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి మెసేజ్!





