భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.యఫ్.టి.యు) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం నిడదవోలు లో ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు కె.వి.రమణ అధ్యక్షతన నిర్వహించడమైనది.
జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల 4 కోడ్ లు గా మార్చి వేసిందనీ, రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక అది ఏ ప్రభుత్వమైనా అంగన్వాడి ల సమ్మె విరమింప చేయడానికై జూన్ నెలలో వేతనం పెంపుద, చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పక్క దారి పట్టించిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిధులను తక్షణమే బోర్డు కు జమచేసి పెండింగ్ లో ఉన్న ఆర్థిక పరిహారాలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
పై సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఐ.యఫ్.టి.యు నాయకులు వీరి నాయుడు, మంగం అప్పారావు, నెహ్రూ, యస్.రామ్మోహన్, సి.హెచ్.రమేష్, నాగరాజు, పామర్తి సత్య నారాయణ, తీపర్తి వీర్రాజు, పి.నాగేశ్వర రావు, గడసఆల రాంబాబు, కాకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం