November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

శ్రీవారి దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్న దళారీపై కేసు

తితిదే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి, మోసగించిన దళారీని విజిలెన్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

తిరుమల, : తితిదే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి, మోసగించిన దళారీని విజిలెన్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తితిదే వింగ్ ఏవీఎస్ వో పద్మనాభన్ కథనం మేరకు.. తమిళనాడులోని సేలంకు చెందిన భక్తుడు కృష్ణస్వామి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చెందిన రాజశేఖర్ ను సంప్రదించారు. ఆయనకు 7 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పించేందుకు రాజశేఖర్ రూ.27 వేలు తీసుకున్నాడు. అనంతరం తితిదే పాలకమండలి సభ్యుడు సౌరభ్ సిఫార్సు లేఖ ఆధారంగా రాజశేఖర్ టికెట్లు పొందాడు. తితిదే విజిలెన్స్ వింగ్ అధికారులు గుర్తించి రాజశేఖర్ను అదుపులోకి తీసుకొని, తిరుమల పోలీసులకు అప్పగించి కేసుపెట్టారు.

Also read



Related posts

Share via