సత్యసాయి: సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని కొడవలితో నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి సంపత్‌రాజును సత్యసాయి జిల్లా ధర్మవరం చెరువు కొడవలితో నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంపత్‌రాజు హత్యకు భూ తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.





