ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మూడవరోజు యోగ శ్రీనివాసుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయదేవేరులతో కొలువై ఆలయ ప్రాంగణం, క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించారు. ఆ తరువాత అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ చిన వెంకన్న సూర్య ప్రభవాహనంపై గ్రామంలో విహరించారు. పలువురు భక్తులు స్వామి, అమ్మ వార్లను దర్శించి తరించారు.
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026





