పెర్కిట్(ఆర్మూర్): వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారిని కూలర్ బలితీసుకుంది. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్లో నివసించే దీపిక, వినీత్ దంపతులకు ఆరేళ్ల కూతురు శృతిక ఉంది.
ఎండాకాలం సెలవులు రావడంతో శృతిక పెర్కిట్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. శనివారం రాత్రి అమ్మమ్మ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా శృతిక ఆడుకుంటూ ఇనుప కూలర్ వద్దకు వెళ్లి, దానిని తాకింది. కూలర్కు విద్యుత్ ప్రసారం కావడంతో శృతిక విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటివరకు ఆడుకుంటూ సరదాగా గడిపిన చిన్నారి అంతలోనే విగత జీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





