ఆప్పటికే ఫ్లాట్‌ఫాంపై ఉన్న బాలుడు ఒక్కసారిగా ఇంజిన్ బోగిపైకి ఎక్కాడు. ఎవరూ ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు..రైల్లోని ప్రయాణికులు, ప్లాట్‌ఫామ్ పై ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రైల్వే పోలీసులు
బాపట్ల రైల్వే స్టేషన్లో ఓ బాలుడు హల్చల్ చేశాడు. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ బాపట్ల రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆగింది. అయితే, అప్పటికే ఫ్లాట్‌ఫాంపై ఉన్న బాలుడు ఒక్కసారిగా ఇంజిన్ బోగిపైకి ఎక్కాడు. ఎవరూ ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు..రైల్లోని ప్రయాణికులు, ప్లాట్‌ఫామ్ పై ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రైల్వే పోలీసులు రంగంలోకి దిగి అతి కష్టం మీద బాలుడికి కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ బాలుడికి మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
Also read :
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





