అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది.
తాడ్వాయి: అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుజాత (48) మండలంలోని కాటాపురంలో అంగన్వాడీ టీచర్ విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధులు ముగించుకుని తన స్వగ్రామమైన ఏటూరునాగారం బయలుదేరారు. బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అడవికి వెళ్లిన తునికాకు కూలీలకు సుజాత మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ శంకర్, ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి మెడకు స్కార్ఫన్ను చుట్టి ఉరి వేసినట్లు గుర్తించారు. సుజాతకు చెందిన నాలుగు తులాల బంగారం, సెల్ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు.
Also read
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
- తల్లికి వందనం డబ్బుల కోసం భార్య హత్య
- కోనసీమ జిల్లాలో విషాదం.. పంటకాల్వలో మునిగి ముగ్గురి మృతి
- ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్యవిద్యార్థిని బలవన్మరణం






Tirumala: గత ఐదేళ్లుగా ఈ మహాపాపం జరుగుతూనే ఉంది.. టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న రమణదీక్షితులు