గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు.

వృద్ధురాలిని బైక్ ఢీకొట్టి.. అట్టొచ్చిన వారిపై దాడి
గుంటూరు(నెహ్రూనగర్), న్యూస్టుడే: గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. శ్రీను అనే యువకుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఏమి జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. నెహ్రూనగర్ ఆరో వీధిలో సలోమి అనే వృద్ధురాలిని ఢీ కొట్టారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఇది చూసిన స్థానికులు పడిపోయిన వృద్ధురాలిని లేపి, వాళ్లను ప్రశ్నించడంతో ఒక్కసారిగా రెచ్చిపోయారు. దాడికి తెగబడ్డారు. ఫోన్ చేసి మరికొందరినీ పిలిపించుకున్నారు. వారంతా కలిసి నెహ్రూనగర్ ఆరో వీధి నుంచి ఒకటో వీధి వరకూ అడొచ్చిన వారిపై దాడి చేసుకుంటూ వెళ్లారు. ఆ పక్కనే ఉన్న బుచ్చయ్యతోట ఐదో వీధిలో ఓ వ్యక్తిని కొట్టసాగారు. విషయం తెలుసుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలికి వచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గొడవ జరిగిందని, గంజాయి బ్యాచ్ కాదని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీఐ అన్వర్ బాషా తెలిపారు. “15 మంది వచ్చి.. మా ఇంటి ఎదురుగా ఉన్నవాళ్లను కొట్టారు. వారంతా గంజాయి మత్తులో ఉన్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు నన్నూ తీవ్రంగా కొట్టారు” అని స్థానికుడు అశోక్ తెలిపారు.

పింఛను కోసం వెళ్లి వస్తుంటే.: సలోమి, గాయపడిన వృద్ధురాలు: బ్యాంకు ఖాతాలో పింఛను డబ్బులు పడ్డాయో లేదోనని తెలుసుకునేందుకు నెట్ సెంటర్కు వెళ్లి వస్తుంటే యువకులు వాహనంపై వచ్చి ఢీకొట్టారు. తలకు గాయం కావడంతో సొమ్మసిల్లి పడిపోయాను.
Also read
- స్మార్ట్ఫోన్ కొనడం ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈఎంఐ భయంతో యువకుడి ఆత్మహత్య!
- ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ప్రిన్సిపల్ సంచలన నిర్ణయం!
- ఊరు మారిన మారని బుద్ధి.. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి!
- ఫేస్బుక్లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి వెళ్తే ఊహించని సీన్..
- సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్





