సుందరా ట్రావెల్స్ చిత్ర కథానాయకి మరో వివాదంలో చి క్కుకున్నారు. దీంతో పోలీసులు కేసు గురించి విచారణ జరుపుతున్నారు. వివరాలు చూస్తే.. చెన్నై, నెర్కుం డ్రం పల్లవన్నగర్ సమీపంలోని ఏరిక్కరై వీధికి చెందిన వ్యక్తి మురళీకృష్ణన్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, ఎన్ఐసీ ఏజెంట్గానూ వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణన్ మాట్లాడుతూ ద్వారకేశ్ అనే తన మిత్రుడికి నటి రాధ పరిచయం చేశానన్నారు.
దీంతో ఆమె రెండేళ్ల క్రితం 90 వేలు బిట్ కాయిన్స్ పె ట్టుబడి పెట్టారన్నారు. అయితే అప్పటినుంచి అత ను ఆ బిట్ కాయినన్ను నటి రాధకు తిరిగి చెల్లించలేదన్నారు. దీంతో నటి రాధ ద్వారకేశు పరిచయం చేసిన తనను ఆ బిట్ కాయిన్స్ తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారన్నారు. అలా రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకు మరో ముగ్గురు స్థానిక చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారన్నారు.
వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరు లు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని చె ప్పారు. అనంతరం తాను స్థానిక వడపళనిలో పోలీస్టే స్టేషన్లో నటి రాధ, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసులు ఈ వ్యహారంపై విచారణ జరుపుతున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025